Highschool Film | Kiran Rathode | High court | "హైస్కూల్"కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. కోర్టు రెడ్ సిగ్నల్
హైస్కూల్ టీచర్‌ను ప్రేమించడం... ఆ తర్వాత ఆమెను రకరకాలుగా చుంభించినట్లు ఊహా లోకాల్లోకి విహరించడం, చివర్లో అదంతా తప్పు.. చదువుపై శ్రద్ధ పెట్టడమే హైస్కూల్ విద్యార్థి చేయాల్సిందంటూ... ఉపదేసించే చిత్రం హైస్కూల్.
గతంలో ఈ తరహాలో జుగుప్సాకరమైన చిత్రాలు వచ్చినప్పుడు మహిళా సంఘాలు, మానవహక్కుల సంఘాలు థియేటర్ల ఆందోళన చేసేవి. హైస్కూల్ సినిమాకు అదే జరిగింది. గత రెండు నెలలుగా ఇటువంటి కారణంతోనే ఈ చిత్రం విడుదలకు నోచులేకపోయింది.
ఆఖరికి చిత్ర దర్శకుడికి 1940లో ఓ గ్రామం చిత్రం తీసినందుకు జాతీయస్థాయి అవార్డు ఇటీవలే ప్రకటించారు. దాంతో హైస్కూలు సినిమాను విడుదల చేయడానికి కసరత్తులు చేశారు. దీని నిర్మాత నాగయ్య, తమది మంచి సందేశాత్మక చిత్రమని చెపుతూ... రెండుసార్లు వాయిదా వేశారు. మొదట హైదరాబాదులో సెన్సార్ బోర్డు ఈ సినిమాపై అభ్యంతరం చెప్పింది. దాంతో ఢిల్లీలో కేంద్ర సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ తెచ్చుకుని ఈ సినిమాను ప్రదర్శించడానికి అనుమతి సంపాదించారు. ఆఖరికి 5.3.2010 శుక్రవారంనాడు సినిమా విడుదలైంది.
ఇదిలావుండగా కుర్రకారు ఇటువంటి సినిమాలు చూస్తే పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే దర్శక నిర్మాత వైఖరి మరొక రకంగా ఉన్నది. తమ సినిమా మంచిదో కాదో అనేది సెన్సార్ బోర్డు నిర్ణయించాలి మినహా వేరే సంఘాలు కాదని వాదిస్తున్నారు. ఈ విషయమై శుక్ర, శనివారాల్లో హైకోర్టు న్యాయవాదులను సంప్రదించారు. కానీ వారు ఇది తమ చేతుల్లో లేదని చేతులెత్తేశారు.
