1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Varudu audio release

Allu Arjun | Varudu audio release | Allu Aravind | రాంగ్ నంబర్ వస్తే చెల్లా చెదురే: అల్లు అర్జున్

అల్లు అర్జున్
WD
వరుడు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెండ్లి వస్త్రాలతో చిత్రం టీమ్ హాజరైంది. వధువు పాత్రధారి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంచారు. కానీ ఆడియో వేడుకను అల్లు అర్జున్ పెళ్లిచూపుల వేదికగా మారడం విశేషం.

అతిథులంతా "వరుడు" సినిమా పెండ్లి వ్యవస్థపై తీసిందనీ, 16 రోజుల పండుగ అంటూ జరిగే పెళ్లి తంతు.. ఆ తర్వాత 5 రోజులకు.. రానురాను ఒక్కరోజు వేడుకగా మారిపోయిందంటూ చిత్రం గురించి వివరించారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పెండ్లి తంతు గురించి కనుక.. ఎలాగో అల్లు అర్జున్‌కు 25 ఏళ్లు వచ్చాయి. అందుకే పెళ్లి చేయాలని నేను, నా భార్య కలిసి ఓ రోజు ఇంట్లో అర్జున్‌ని అడిగాం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. గౌరవంగా చేస్తాను అన్నాను. కాసేపు సైలెంట్ అయిన తర్వాత.. మీరు ఎవరిని చూసినా చేసుకుంటాను డాడీ.. అని చెప్పాడు.

అదికాదు... నీకంటూ కొన్ని ఆలోచనలుంటాయి.. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి.. అంటూ మూడు ప్రశ్నలు వేశాను. దానికి అర్జున్ సమాధానమిస్తూ...
1. అందంగా ఉండాలి
2. సిటీ అమ్మాయి... అయితే అందులోనూ మెట్రో కల్చర్ మిస్ కాకుండా ఉంటే బావుంటుంది
3. ఫ్యామిలీ వాల్యూస్ కూడా తెలిసి ఉండాలి. కుటుంబ ఆప్యాయతలు, అనుబంధాలు తెలిసి ఉండాలి

ఇవేవీ తెలీకుండా రాంగ్ నంబర్ వస్తే చెల్లాచెదురవుతుందని అన్నాడు. ఇవన్నీ వినగానే నా భార్య... అంటే అర్జున్ అమ్మ.. ఒక్కసారిగా అర్జున్‌ను కౌగలించుకుని ఏడ్చేసింది. ఇంత ఫర్ఫెక్ట్‌గా ఆలోచించే కొడుకు లభించడం ఆనందంగా ఉన్నదని చెప్పింది" అన్నారు

ఇదంతా విన్నాక... ఇది అల్లు అర్జున్ పెళ్లి చూపుల వేదిక అయిందని ముఖ్య అతిథి రాజమౌళి వ్యాఖ్యానించారు. ఇక రేపటి నుంచి అల్లు అరవింద్ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ కడతారని వేణు మాధవ్ అభివర్ణించారు. ఏదేమైనా అసలు ఆడియో ఫంక్షన్ మాత్రం చప్పగా సాగింది. ఒక్క పెళ్లి చూపుల తతంగం మాత్రం ఆకట్టుకుంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT