1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress Anuhka

Nagachaitanya | Actress Anuhka | Sridevi | Deepika Padukone | Katrina Kaif | అనుష్క నాకు అక్కలా ఉంటుంది: నాగ చైతన్య

నాగచైతన్య
తనకిష్టమైన నటీమణులు శ్రీదేవి, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్... అంటూ అక్కినేని నాగచైతన్య చెప్పాడు. "ఏ మాయ చేసావె" చిత్రం సక్సెస్ తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చాడు. 

అదిసరే.. టాలీవుడ్ బ్యూటీ అనుష్క సంగతి చెప్పలేదేమిటని ఓ తుంటరి విలేకరి వేసిన ప్రశ్నకు నవ్వుతూ... "అనుష్క అయితే నాకు అక్కలా ఉంటుంద"ని సమాధానమిచ్చాడు. కనుక ఆమెతో నటించే ఛాన్సే లేదని చెప్పినట్లయింది.

తన తండ్రి నాగార్జునతో కలిసి నటించే ఆలోచన ఉన్నదనీ, స్క్రిప్ట్ సమకూరితే తప్పకుండా చేస్తానని వెల్లడిస్తూ... తండ్రీ కొడుకుల్లా కాక అన్నదమ్ములుగా నటిస్తామని సూచనప్రాయంగా చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT