1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Lakshmi Parvati

Actor Balakrishna | Lakshmi Parvati | NT Rama Rao | అమ్మా..! నీ ఇంటికొస్తా...!!: యువరత్న బాలకృష్ణ

బాలకృష్ణ
WD
వెండితెర వెలుగు స్వర్గీయ ఎన్‌.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతి ఇంటికి నందమూరి బాలకృష్ణ బుధవారం పనిగట్టుక వెళ్లారు.

ఇంటికి వెళ్లిన బాలకృష్ణ, తన తండ్రి మ్యూజియం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించి, దానిని ఎన్టీఆర్ అభిమానుల సందర్శనార్థం ఆధునీకరించాలని తల్లి లక్ష్మీపార్వతికి విన్నవించినట్లు ఓ ప్రైవేటు టెలివిజన్ వెల్లడించింది.

గతంలో తమ మధ్య నెలకొన్న పొరపొచ్చాలు తొలగిపోయాయనీ, అమ్మ( లక్ష్మీ పార్వతి)తో తనకు ఎటువంటి విభేదాలు లేవని యువరత్న బాలకృష్ణ వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు లక్ష్మీ పార్వతి కూడా తన కొడుకు(బాలకృష్ణ)తో తనకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పినట్లు వార్త.

మొత్తమ్మీద చానాళ్ల తర్వాత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తన ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని లక్ష్మీ పార్వతి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT