గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » లారెన్స్ "సూపర్ కౌ బాయ్" ఆడియో విడుదల (Larence, Super Cowboy, Padmapriya, Sandhya, Audio)
కథనాలు
Bookmark and Share Feedback Print
 
రాఘవ లారెన్స్, పద్మప్రియ, లక్ష్మీరాయ్, సంధ్య నటిస్తోన్న సూపర్ కౌబాయ్ చిత్రం ఆడియో విడుదలైంది. మంగళవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగార్జున ఆడియోను విడుదల చేసి లారెన్స్‌కు ఇచ్చారు.

లారెన్స్ మాట్లాడుతూ... డాన్స్ దర్శకుడిగా ఉన్న నన్ను మాస్ చిత్రం ద్వారా నాగార్జునగారు డైరెక్టర్ని చేశారు. అప్పుడు ఆయనకు కథ చెప్పగానే విని వెంటనే అక్కడి వారితో టైటిల్ రిజిస్టర్ చేయండి.. నెక్ట్స్ సినిమాకు లారెన్స్ దర్శకుడు అని ప్రకటించారు. అంత ఆప్యాయతానురాగాలు ఎక్కువగా చూపిస్తారు. అందుకే ఆయనంటే నాకు ఇష్టం.

నేను ఈ ఫంక్షన్‌కు అడగగానే తప్పకుండా వస్తానని చెప్పారు. ఎంతో ప్రేమగా మాట్లాడతారు. కౌబాయ్ సినిమా అనగానే కొత్తదనం ఉండేటట్లుగా శింబుదేవన్ ట్రీట్ చేశారు. అంతా చాలా సరదాగా షూటింగ్ పూర్తి చేశాం. పద్మప్రియకు మాట్లాడితే నవ్వు వస్తుంది. ఆమె వల్ల చాలా టేక్‌లు తిన్నాం. అయినా దర్శకుడు విసుగు లేకుండా చక్కగా తీశారు.

ఈ సినిమా కోసం డేట్స్ చాలా ఖర్చయ్యాయి. షూటింగ్ పూర్తయిందనుకున్న కొద్ది రోజులకు మళ్లీ డేట్స్ కావాలని అడిగేవారు. అదేంటి మొన్ననేగా అయిపోయిందంటే.. అది వేరే సినిమా అమ్మా.. అంటూ ఆప్యాయంగా చెపుతూ తన పని పూర్తి చేసుకునేవారు. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

నాగార్జున మాట్లాడుతూ... లారెన్స్ మాటలు వింటుంటే చాలా ఎంజాయ్ చేసినట్లున్నారు. గతంలో కృష్ణగారు నటించిన మోసగాళ్లకు మోసగాడు వంటి చిత్రాలను చూశాను. లారెన్స్ మంచి మనసున్నవాడు. తను సంపాదించింది అనాధలకు ఖర్చు చేస్తుంటాడు. అందుకే లారెన్స్ అంటే చాలా ఇష్టం. అతని ప్రతి సినిమాలోనూ అనాధ పాత్ర ఉంటుంది. కింగ్‌లో నా చేత వేయించాడు. మాస్‌లో కూడా అంతే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రాఘవ లారెన్స్, పద్మప్రియ, లక్ష్మీరాయ్, సంధ్య, సూపర్ కౌబాయ్ నాగార్జున