Actor Venkatesh | Apta Rakhaka | P.Vasu | Bellamkonda Suresh | విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక"
WD
కన్నడంలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తోన్న బిగ్గెస్ట్ హిట్ ఆప్త రక్షక తెలుగు రీమేక్ రైట్స్ కోసం ఎంతోమంది ప్రయత్నించినా బెల్లంకొండ సురేష్ ఈ హక్కులను దక్కించుకున్నారు. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంపై ఎన్నో ఊహాగానాలు వచ్చినా విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నారని చెప్పి బెల్లంకొండ సస్పెన్స్‌కు తెరదించారు.
ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... "చంద్రముఖి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పి.వాసు కన్నడంలో అందించిన ఆప్తరక్షక సూపర్ హిట్ అయి 40 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తూ కన్నడ చిత్రరంగంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో మా బ్యానర్లో నిర్మిస్తున్నాం.
ఆప్తరక్షక ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ ప్రధానంగా ఉంటూ ఓ విభిన్న కథా చిత్రంగా అందరినీ అలరిస్తుంది. ఈ సబ్జెక్ట్ వెంకటేష్‌కు అద్భుతంగా ఉంటుంది. చిత్రం చూడగానే ఎంతో ఇన్‌స్పైర్ అయి వెంటనే చేస్తానని వెంకటేష్ బాబు అనడం నాకెంతో ఆనందంగా ఉంది. మళ్లీ వెంకటేష్- పి. వాసు కాంబినేషన్లో ఆప్తరక్షక చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక విలువలతో మా బ్యానర్లో ఓ ప్రిస్టీజియస్ మూవీగా మే నెల నుంచి ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నామ"ని చెప్పారు.