1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Baby Boy

Karisma Kapur | Baby Boy | Sanjay Kapur | Mumbai | Samaira | కరిష్మా కపూర్‌కు బాబు పుట్టాడోచ్..!

కరిష్మా కపూర్
FILE
బాలీవుడ్ సుందరాంగి కరిష్మా కపూర్ ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కరిష్మా కపూర్‌లో బాబు పుట్టాడని ఆమె కుటుంబీకులు తెలిపారు.

ఢిల్లీకి చెందిన పారిశ్రామిక వేత్త సంజయ్ కుమార్‌తో కరిష్మా కపూర్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కరిష్మా కొపూర్ యాడ్ చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది.

ఇకపోతే.. కరిష్మా కపూర్ దంపతులు ఇప్పటికే ఐదేళ్ల సమైరా అనే అమ్మాయి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ పండంటి మగబిడ్డకు కరిష్మా కపూర్ జన్మనిచ్చిందని ఆమె కుటుంబీకులు వెల్లడించారు. ఇంకా తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వారు చెప్పారు.

కరిష్మా కపూర్‌కు మగ సంతానం పుట్టడంతో ఆమె స్నేహితురాలు, జ్యుయెల్లరీ డిజైనర్ ఫరాఖాన్ అలితో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కరిష్మాకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలా ఉంటే 35 ఏళ్ల కరిష్మా కపూర్‌కు రాజా హిందూస్థానీ, హీరో నెంబర్.1, దిల్ తో పాగల్ హై వంటి చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టిన సంగతి తెలిసిందే.
About Writer
SELVI.M