Vintage Night | Black & White | Chennai | Residency | Hotel | Hoolywood | Bollywood | ది రెసిడెన్సీ టవర్‌లో నేటి నుంచి వింటేజ్ నైట్!
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని నక్షత్ర హోటళ్ళలో ఒకటైన ది రెసిడెన్సీ టవర్‌లో నేటి నుంచి బ్లాక్ అండ్ వైట్ పేరిట సంగీత విభావరి జరుగనుంది. స్థానిక త్యాగరాయ నగర్‌లోని జీఎన్‌శెట్టి రోడ్డులో ఉన్న ది రెసిడెన్సీ హోటల్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రఖ్యాత గాయకుడు డీజే.సురోజిత్ గుహా హాలీవుడ్, బాలీవుడ్ గీతాలను ఆలపిస్తారు.
ప్రధాంగా, 60, 70, 80 సంవత్సరం నాటి ఆ పాత మధురాలను ఆలపిస్తారు. అంతేకాకుండా మరో గాయకుడు రఫీ పాతతరం ఇంగ్లీష్ గాయకులైన డీనా మార్టి, నాట్ కింగ్ కోలే, అండీ విలియమ్స్, క్లిఫ్ రిచర్డ్స్ స్వర బాణీలలో ఆలపించనున్నారు.
చెన్నయ్, ముంబై, బెంగుళూరు, కాలికట్, కోల్‌కతా, ఢిల్లీ తదితర నగరాల్లో ఈయన 500 స్టేజ్ కార్యక్రమాలు ఇచ్చి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు.
సంగీత మేధావి ఇళయరాజా సమక్షంలో మ్యూజిక్ మ్యాస్ట్రో సునీల్ చౌదరి బృందంలో కూడా ఈయన తన గానాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 2825 3434 అనే ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.