1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sreya

Raviteja | Sreya | Don Seenu | Gopichand Malineni | రవితేజ- సెక్సీ క్వీన్ శ్రేయ జంటగా "డాన్ శీను"

రవితేజ
WD
క్రేజీస్టార్ రవితేజ, శ్రేయ జంటగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ కె. అచ్చిరెడ్డి సమర్పణలో వి.సురేష్ రెడ్డి సహ నిర్మాతగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ క్రేజీ చిత్రం డాన్ శీను నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రం నైజాం ఏరియాలో ఏషియన్ ఫిలింస్, ఓవర్సీస్ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ ఫ్యాన్సీ ఆఫర్‌తో కొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సీడెడ్ ఏరియా రైట్స్ జి.బి.ఆర్. ఫిలిమ్స్ మహేష్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు హరి పిక్చర్స్ హరికుమార్ మంచి ఆఫర్స్ ఇచ్చి స్వంతం చేసుకున్నారు. ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుండగానే స్పీడ్ గా బిజినెస్ అవుతున్న డాన్ శీను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

రవితేజతో కిక్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకట్, డాన్ శీనుతో మరో సూపర్ డూపర్ హిట్ ఇవ్వబోతున్నారు. క్రేజీస్టార్ రవితేజ, శ్రీహరి, శ్రేయ, షాయాజి షిండే, బ్రహ్మానందం, అలీ, సునీల్, రఘుబాబు, కృష్ణ భగవాన్, నాజర్, దువ్వాసి మోహన్, బ్రహ్మాజీ, ఢిల్లీ రాజేశ్వరి, సత్యం రాజేష్ నటిస్తున్నారు.

ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, స్టిల్స్: కె. రాజా, ప్రొడక్షన్ కంట్రోలర్: కొత్తపల్లి మురళీకృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి. సుబ్బారావు, తుమ్మల రామిరెడ్డి, బి. శ్రీనివాస్, స్క్రీన్ ప్లే, మాటలు: కోన వెంకట్, సంగీతం: మణిశర్మ, నిర్మాత: వెంకట్, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గోపీచంద్ మలినేని
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT