1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. రవితేజ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం

Actor Raviteja, Yellow Flowers, Harish Sankar | రవితేజ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం

రవితేజ
క్రేజీస్టార్ రవితేజ హీరోగా యువదర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మిస్తున్న భారీ చిత్రం మార్చి 25న ప్రారంభం కాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ... రవితేజ హీరోగా నిర్మించే ఈ చిత్రం కోసం హరీశ్ శంకర్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. భారీ ఎత్తున హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మార్చి 25న ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఫస్ట్ పిక్చర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం మా బ్యానర్‌కు మంచి పేరు తెస్తుందని అన్నారు

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్, సంగీతం: థమన్ ఎస్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: హరీశ్ శంకర్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT