1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kajal Agarwal

Actor Prabhas | Kajal Agarwal | Darling | April 16 | ఏప్రిల్ 16న ప్రభాస్- కరుణాకరన్ "డార్లింగ్"

ప్రభాస్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది.

ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ... కరుణాకరన్ నాకు ఇష్టమైన డైరెక్టర్. తొలిప్రేమ, ఉల్లాసంగా... ఉత్సాహంగా, చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను. డార్లింగ్ స్టోరీ నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసింది. లవ్ అండ్ యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్, ఫ్యామిలీ ఫీల్ అన్నీ ఉండే మంచి సినిమా "డార్లింగ్" అన్నారు.

నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ... డార్లింగ్ కరుణాకరన్ స్టైల్‌లో మంచి ఫీల్ ఉన్న సినిమా. ఇందులో లవ్ ఫీల్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఉన్నాయి. ఇది అందరికీ నచ్చుతుంది. లవ్ స్టోరీ అయినా కూడా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు మాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టకుంటుంది. ప్రభాస్ అద్భుతంగా చేశాడు. కరుణాకరన్ ఎక్స్‌టార్డినరీగా తీశాడు. ఒక పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయింది. మార్చి నెలాఖరులో ఆడియోను ఏప్రిల్ 16న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ... డార్లింగ్ క్లాస్‌గా కనిపించే మాస్ లవ్ స్టోరీ. మాస్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ప్రభాస్ పెర్‌ఫార్మెన్స్ సూపర్. మేకింగ్ పరంగా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు కాంప్రమైజ్ అవకుండా సినిమా తీసారు. నేను చాలా హ్యాపీ... అన్నారు.

ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, రాజా శ్రీధర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు స్వామి, సంగీతం జి.వి ప్రకాష్, పాటలు అనంత శ్రీరామ్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం కరుణాకరన్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT