1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Balakrishna

Simhaa | Balakrishna | Nayanatara | Sneha Ullal | ఏప్రిల్ రెండో వారంలో బాలకృష్ణ "సింహా"

సింహా
WD
బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల కథానాయకుడు యువరత్న బాలకృష్ణ హీరోగా, భద్ర, తులసి వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న భారీ చిత్రం "సింహా". ఈ చిత్రానికి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌‍లో మార్చి 17 నుంచి పాటల చిత్రీకరణ జరుగబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ... రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో బాలకృష్ణ, స్నేహా ఉల్లాల్, నమితలపై ఓ పాట, బాలకృష్ణ- స్నేహా ఉల్లాల్‌లపై మరోపాట తీస్తున్నారు. దీంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం రీ- రికార్డింగ్ జరుగుతోంది. మార్చి నెలాఖరులో ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ రెండో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేయాడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ... బాలయ్య బాబు క్యారెక్టర్ పేరులోనే సింహా ఉంటుంది. ఇందులో బాలయ్య బాబుని ఓ కొత్త డైమెన్షన్లో చూపించబోతున్నాం. ఇంతకుముందు బాలయ్యబాబు చేసిన క్యారెక్టర్లకు పూర్తి భిన్నంగా ఉండే ఈ క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేస్తున్నారు. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుంది.

భద్ర, తులసి చిత్రాల తర్వాత దర్శకుడుగా ఇది నాకు హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను అన్నారు. యువరత్న బాలకృష్ణ సరసన నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: బోయపాటి శ్రీను
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT