Anushka | Panchakshari | Shooting | Arundhati | Samudra | అనుష్క "పంచాక్షరి" షూటింగ్ పూర్తి!
WD
రాజమండ్రి షెడ్యూల్‌తో దాదాపుగా ఈ చిత్రం పూర్తయ్యింది. ఏప్రిల్ మొదటివారంలో ఆడియోను, ఏప్రిల్ చివరివారంలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత చంద్ర సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ.. "ఇది ఒక అద్భుతమైన స్క్రిప్ట్. అరుంధతికి దీనికి ఏవిధమైన పోలిక వుండదు. దర్శకుడు సముద్ర దీన్ని అద్భుతంగా తీస్తున్నారు. టెక్నీషియన్స్ అందరూ ఇన్‌వాల్వ్ అయి వర్క్ చేస్తున్నారు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర చాలా ప్రాధాన్యతను కలిగి వుంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథ సాగుతుంది. నిర్మాతగా చంద్రకు ఇది గ్రాండ్ ఎంట్రీ అవుతుంది" అన్నారు.
చిత్ర దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. "అనుష్క కెరీర్‌లో మరో సెన్సేషనల్ ఫిలింగా "పంచాక్షరి" రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత చంద్ర ఏవిషయంలోను రాజీపడకుండా నిర్మిస్తున్నారు. యూనిట్‌లో ప్రతి ఒక్కరూ సూపర్‌హిట్ ఫిల్మ్‌గా మలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు" అని చెప్పారు.
నిర్మాత చంద్ర మాట్లాడుతూ.. "నేను అన్నపూర్ణ సంస్థకి సదా రుణపడి వుంటాను అని అనడంకన్నా జీవితంకాలం రుణపడే వుంటాను. నిర్మాతగా మంచి సినిమాను చేస్తున్నాను. ఈ చిత్రానికి అనుష్క ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. 2010లో పంచాక్షరి తప్పకుండా ఓ సూపర్‌హిట్ చిత్రం నిలబడుతుంది" వెల్లడించారు.
అనుష్క, సామ్రాట్ (తొలి పరిచయం), నాజర్, చంద్రమోహన్, డా. బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, ఆలీ, రఘుబాబు, ఎం.ఎస్. నారాయణ, జీవా, బెనర్జీ, ఉత్తేజ్, నల్ల వేణు, రవిప్రకాష్, సుబ్బరాయశర్మ, సుధ, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: వాసు, కథ: మధు విప్పర్తి, మాటలు: తోట ప్రసాద్, మ్యూజిక్ డైరక్టర్: చిన్నా, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, డాన్స్: లారెన్స్, అమ్మరాజశేఖర్, శివశంకర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, కళ: జి.కె. మూర్తి, పబ్లిసిటీ: కృష్ణప్రసాద్, కో-డైరక్టర్: పిహెచ్. సుందరం, స్టిల్: పాండ్యన్, ఫైట్స్: సెల్వ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకటరత్నం, నిర్మాత: బొమ్మదేవర రామచంద్రరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి. సముద్ర.