Cinema | Tollywood | Pyracy | CDS | Videos | పైరసీని గూండా యాక్ట్ కింద చేర్చండి: శివాజీ
WD
అసెంబ్లీలో చిరంజీవి, జయసుధలు పైరసీని అరికట్టాలని కోరిన మేరకు వారికి సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా మాయగాడు నిర్మాత యలమంచి రవిచంద్ సోమవారంనాడు ఫిలింఛాంబర్ బయట పైరసీ నివారణకు తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు.
పైరసీ సెల్ అనేది ఉన్నా పైరసీకారులను పట్టించి పోలీసులకు అప్పుచెపుతున్నా... వారు వెంటనే బెయిల్‌పై రావడం... మళ్లీ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతున్నాయనీ.. అందుకే ముఖ్యమంత్రి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
పైరసీని అరికట్టేంతవరకూ సినిమా షూటింగ్ లన్నిటినీ నిరవధింగా ఆపివేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దర్శకుడు వినాయక్, నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.