Cinema | Tollywood | Pyracy | D. Suresh Babu | పైరసీని అరికట్టకపోతే షూటింగ్‌లు బంద్: సురేష్
WD
ఉన్న చట్టాన్ని అమలు చేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యానిస్తే, పరిశీలిస్తామని మంత్రి గీతారెడ్డి చెప్పడంపై నిర్మాతల మండలి అసంతృప్తిని వ్యక్తం చేసింది.
గతంలో పైరసీ సెల్ ఏర్పాటు చేసి పైరసీలకు పాల్పడుతున్న సుమారు 6వేల మందిని పట్టుకుని పోలీసులకు అప్పచెబితే... వారంతా దర్జాగా బయటే తిరుగుతున్నారన్నారు. వారికి సరైన శిక్షలు పడకపోవడంతో తిరిగి కాలర్ ఎగరేసుకుంటూ పైరసీ కార్యకలాపాలను యధేచ్ఛగా చేసుకుంటూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే... పైరసీ రాయుళ్లు సినీ నిర్మాతలను భారీగా దెబ్బతీస్తున్నారన్నారు. పైరసీని అరికట్టే వరకూ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే షూటింగ్‌లను ఆపివేస్తామని నిర్మాత డి. సురేష్ బాబు అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించిన పైరసీని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.