Pyraci | Tollywood | Producers | Chiranjeevi | Nagarjuna | Jr NTR | పైరసీకారులు నిర్మాతల జేబులు కత్తిరిస్తున్నారు: చిరు
WD
గత మూడు రోజులుగా ఫిలిమ్ ఛాంబర్లో పైరసీపై పోరాడుతున్న "మాయగాడు" చిత్ర నిర్మాత యలమంచి రవిచంద్‌కు మద్దతుగా చిరంజీవి బుధవారం మధ్యాహ్నం సంఘీభావం తెలిపారు. ఇంకా అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్, నాగచైతన్యతోపాటు 24 క్రాఫ్ట్‌కు చెందిన సంఘాలు సంఘీభావాన్ని తెలిపాయి.
ఎన్టీఆర్ మాట్లాడుతూ... నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచీ పైరసీ ఉంది. వచ్చినప్పటినుంచీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బాబాయ్ బాలకృష్ణగారు షూటింగ్ బిజీలో రాలేకపోయారు. మేం ప్రభుత్వానికి విన్నవించేది ఏమంటే... దయచేసి మమ్మల్ని నమ్ముకున్న వేల కుటుంబాలను ఆదుకోండి అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ... ప్రభుత్వం ఇండస్ట్రీ నుంచి పలు రకాలుగా టాక్స్‌లు వసూలు చేస్తుంది. అదే సమయంలో పైరసీ నివారణకు చేపట్టింది శూన్యమని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలని కోరారు. కఠినమైన శిక్ష అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్‌కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.