1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Tollywood

Piracy Cine Videos | Tollywood | Producers | Actors | పైరసీకి వ్యతిరేకంగా 19న టాలీవుడ్ బంద్

పైరసీ సినీ విడియోలు
WD
నిర్మాతలను భారీగా కుంగదీస్తున్న పైరసీ రక్కసిని మట్టుబట్టేందుకు తెలుగు సినీ పరిశ్రమ పట్టుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పైరసీపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తామని హామీ ఇవ్వడంతోపాటు అమలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి తెలుగు సినీ పరిశ్రమ అంతా డిమాండ్ చేస్తుంది. ఇందుకు గాను మార్చి 19న సినిమా పరిశ్రమ బంద్ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్చి 19 శుక్రవారం నాడు సినిమాలను విడుదల చేయనున్న నిర్మాతలు వారి చిత్రాలను మార్చి 20కి వాయిదా వేసుకోవలసిందిగా సూచించారు. మార్చి 19న నటుడు శివాజీ చిత్రం తాజ్ మహల్ విడుదల కానుంది.

దీనిపై శివాజీ స్పందిస్తూ... పైరసీ జీవన్మరణ సమస్య. అదుర్స్, నమో వేంకటేశ చిత్రాలు కలెక్షన్లు కురిపించాల్సిందిపోయి పైరసీల కారణంగా ఒకట్రెండు వారాలకే కలెక్షన్లు పడిపోయాయని అన్నారు.

తన సినిమాను కావాలంటే 20వ తేదీ నాడే కాదు 26వ తేదీకి కూడా వాయిదా వేసుకుంటానని శివాజీ తెలిపాడు. పైరసీలకు అడ్డుకట్ట వేసేందుకు జరుగుతున్న పోరాటంలో థియేటర్ల యజమానులు కూడా భాగస్వామ్యం కావాలని చిత్ర నిర్మాతల మండలి పిలుపునిచ్చింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT