1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Bhumika

Collector gari Bharya | Bhumika | Prakash Raj | మహిళ హక్కులకోసం "కలెక్టర్ గారి భార్య"

ప్రకాష్ రాజ్
WD
ప్రకాష్ రాజ్, భూమిక జంటగా నూతన చిత్ర నిర్మాణ సంస్థ అమోగ్ ఎంటర్ టైన్మెంట్స్ తమ తొలిచిత్రంగా "కలెక్టర్ గారి భార్య"ను రూపొందిస్తోంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీనిని దర్శకుడు టేకుల కృపాకర్ రెడ్డి రూపొందిస్తున్నారు. వి.వనితావాణి, ఎ.రాధికా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంకోసం ఓ గీతాన్ని నాయిక భూమికతోపాటు దాదాపు ఐదువందలమంది మహిళలు పాల్గొనగా హైదరాబాద్‌లోని రోడ్లపై చిత్రీకరించారు. "చేయిచేయి కలిపి కదలవే మగవానితో సమ హక్కులు పొందేవరకు.." అనే పల్లవితో సాగే ఈ గీతాన్ని రచయిత పైడిశెట్టి రామ్ రచించగా, శివశంకర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు.

మహిళలు తమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకోసం, సమానత్వంకోసం, హక్కులకోసం చేస్తున్న ఉద్యమానికి భూమిక నాయకత్వం వహించే నేపధ్యంలో వస్తుందీ గీతం అని దర్శకుడు వివరించారు.

ఇందిర పాత్రలో భూమిక, ఎంబీఎ గోల్డ్ మెడలిస్ట్, ఐఏస్ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్‌ల పాత్రల స్వరూప, స్వభావాలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. వీరిద్దరి మధ్య జరిగే సంఘటనలు ప్రతి కుటుంబాన్ని ఆలోచింపచేస్తాయని తెలిపారు దర్శకులు. ఈ నెలలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఏప్రిల్ మొదటివారంలో ఆడియోను, మే నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇతర ప్రధాన పాత్రల్లో పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, తనికెళ్ల, ధర్మవరపు, వేణుమాధవ్, శివపార్వతి, ఢిల్లీ రాజేశ్వరి నటించారు. రచన: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్నా, నిర్మాతలు: వనితావాణి, రాధికారెడ్డి, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: టేకుల కృపాకర్ రెడ్డి
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT