Om Sai Ram | Srinivasa Varma | Kota | Sudha | Sudeepa | "ఓం సాయిరాం" షూటింగ్ ప్రారంభం
WD
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు, నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ... షిర్డీ సాయి భక్తుల యదార్థ అనుభవాలతో అల్లిన కథతో ఈ సినిమాను తీస్తున్నాం. కలలో కనిపించి ఈ సినిమా తీయమని సాయి ఆదేశించారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు చిత్రీకరణ జరిపి, ఏప్రిల్ తొలివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం అని చెప్పారు.
బాబా సందేశాన్ని అందుకుని ఈ సినిమా తీస్తున్నామనీ, తప్పకుండా ఈ చిత్రం బాబా భక్తులతోపాటు అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందనీ సహ నిర్మాత కొత్తూరు శత్రుఘ్నుడు తెలిపారు.
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సర్వమానవ సౌభ్రాతృత్వం కోరుకున్న మహనీయుని లీలలు ఈ సినిమా. ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు అన్నారు. ఈ సమావేశంలో నటులు రావు రమేశ్, అశోక్ కుమార్, నటి రాజ్యలక్ష్మి మాట్లాడారు.
శ్రీనివాస వర్మ, ఎల్బీ శ్రీరాం, నాజర్, నూతన్ ప్రసాద్, సుధ, సుదీప, అల్లరి సుభాషిణి తదితరులు నటించారు. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: చక్రి, కథ-స్క్రీన్ ప్లే- నిర్మాణం - దర్శకత్వం: శ్రీనివాస్