Sushant Birth day | Cake | Akkineni Nageswara Rao | అప్పుడు చాక్లెట్లు పంచాను: అక్కినేని నాగేశ్వర్రావు
WD
ఆ తర్వాత పుట్టినరోజు ఇంటిలో మామూలుగా చేసుకున్నాను. ఇప్పుడు మటుకు నా అభిమానుల సమక్షంలో జరుపుకుంటున్నాడు" అని అక్కినేని నాగేశ్వరరావు గురువారం సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా కేక్ తినిపిస్తూ అభిమానులనుద్దేశించి అన్నారు. "నా అభిమానులు దండలు వేస్తారు. అవే మాకు అండదండలు..." అని పేర్కొన్నారు.
అక్కినేని నటవారసునిగా సుశాంత్ కాళిదాసు, కరెంట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించారు. తాజాగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది జులైలో ప్రారంభిస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. ఇదే ఏడాదిలో అక్కినేని నాగార్జునతో చిత్రం ఉంటుందని తెలిపారు.
సుశాంత్ మాట్లాడుతూ... కొత్త లుక్‌తో మీ ముందుకు వస్తున్నాను. ఏ మాయ చేసావె హిట్‌తో ఇండస్ట్రీ కళకళలాడుతోంది. కరెంట్ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ శ్రీ నాగ్ కార్పొరేషన్‌లోనే సూపర్ డూపర్ హిట్ కొట్టాక బయట బ్యానర్లో చేయాలనుకున్నాను. అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే కథాంశంతో చిత్రం రూపొందుతోంది అన్నారు.
నాగసుశీల మాట్లాడుతూ... మా అబ్బాయి పుట్టినరోజును అభిమానుల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది. కొడుకుగా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.