Piracy | MAA | CM | Rosaiah | పైరసీపై ప్రభుత్వ స్పందన భేష్: బంద్ విరమించుకుంటున్నాం
పైరసీపై ప్రభుత్వం ఇచ్చిన హామీతో సంతృప్తి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) శుక్రవారం తలపెట్టిన బంద్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. యధావిధిగా సినిమా షూటింగ్‌లు జరుగుతాయని చెప్పారు.
ముఖ్యమంత్రిని, సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డిని కలిసిన చిత్రపరిశ్రమ ప్రముఖుల్లో మురళీ మోహన్, శేఖర్ బాబు, అల్లు అరవింద్, శ్యాంప్రసాద్ రెడ్డి, సురేష్ బాబుతో పాటు అనేకమంది ఉన్నారు.
ఇదిలావుండగా, పైరసీని నిరోధించాలని కోరుతూ నిర్మాత రవిచంద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష గురువారంతో నాలుగో రోజుకు చేరిన విషయం తెల్సిందే. ఈయనకు చిత్రపరిశ్రమ యావత్తు సంఘీభావం ప్రకటించింది.
ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రముఖులు ముఖ్యమంత్రి, మంత్రి గీతారెడ్డిని కలిసి సమస్య తీవ్రతపై చర్చించడంతో వారు సానుకూలంగా స్పందించి చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పైరసీ సమస్యకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో యలమంచి దీక్ష విరమించారు.