1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Friendly Movies

Sairam Shankar | Friendly Movies | Akkineni Nageswara Rao | Sri Hari | Bumper Offer | Shooting | April | ఏప్రిల్‌లో అక్కినేని-శ్రీహరి-సాయిరాంశంకర్‌ల సినిమా షూటింగ్!

అక్కినేని నాగేశ్వరరావు
WD
ఆరోప్రాణం, పవిత్ర ప్రేమ, కృష్ణబాబు, తిరుమల తిరుపతి వెంకటేశ, అల్లరి రాముడు, అడవిరాముడు, ఒక ఊరిలో వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల తాజాగా నిర్మిస్తున్న భారీ చిత్రంలో డా.అక్కినేని నాగేశ్వరరావు, రియల్‌స్టార్ శ్రీహరి, "బంపర్ ఆఫర్" హీరో సాయిరాం శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం గురించి హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ.. "బంపర్ ఆఫర్ హిట్ అయిన తర్వాత హీరోగా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ చిత్రం కథ ఎంతో నచ్చి పూర్తిగా దీనిమీదే దృష్టి సారించాను. స్టూడెంట్ నెం.1, నిన్నేపెళ్ళాడుతా వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన పృథ్వితేజ ఈ చిత్రానికి అద్భుతమైన కథ సిద్ధం చేశారు.

సూపర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ గత ఆర్నెల్లుగా ఈ కథ మీద వర్క్ చేసి బ్రహ్మాండమైన డైలాగ్స్ రాశారు. సీనియర్ మోస్ట్ కెమెరామెన్ ఎస్. గోపాలరెడ్డి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించడం విశేషం. సంగీత దర్శకుడు చక్రి సూపర్‌హిట్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

కథలో అత్యంత కీలకమైన పాత్రలో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు. అలాగే మరో ముఖ్యపాత్రను రియల్ స్టార్ శ్రీహరి చేస్తున్నారు. బంపర్ ఆఫర్ తర్వాత హీరోగా నా ఇమేజ్‌ని పెంచే భారీ చిత్రమిది" అని చెప్పారు.

ఇంకా హీరో సాయిరామ్ మాట్లాడుతూ.. "ఇందులో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్. నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, వేణుమాధవ్ వంటి ప్రముఖు నటిస్తున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ బేనర్‌పై కొంత గ్యాప్ తర్వాత నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం పకడ్బందీగా హోమ్‌వర్క్ చేసి పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌తో ఓ సూపర్‌హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో చంటి అడ్డాల కృషి చేస్తున్నారు. తప్పకుండా నా కెరీర్‌కి, ఫ్రెండ్లీ మూవీస్ బేనర్‌కి ఈ చిత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది.

ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమై కన్యాకుమారి, చిదంబరం, కంచి, హైదరాబాద్‌లలో ఏకధాటిగా చిత్రీకరణ జరుగుతుంది. ఇంకా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అన్నయ్య పూరీ జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించిన అశోక్‌కుమార్ లాలమ్ స్క్రీన్‌ప్లే దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది" అని వెల్లడించారు.
About Writer
SELVI.M