Krishnudu | Pappu | Subbaraju | Deepika | Shooting | Ashta chemma | శరవేగంగా కృష్ణుడి "పప్పు" సినిమా షూటింగ్!
WD
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. " నేను అష్టాచమ్మాకు కోడైరక్టర్‌గా పనిచేశాను. అప్పుడే కథ రాసుకున్నాను. కృష్ణుడు మంచి పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో సుబ్బరాజు పాత్ర కూడా చాలా కీలకమైంది. స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమిది" అని చెప్పారు.
సుబ్బరాజు మాట్లాడుతూ... ఎమోషన్‌తో కామెడీ కలిపిన చిత్రమిదన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. తాము ఆస్ట్రేలియా ఉంటామని, ఈ కథ నచ్చి సినిమా తీస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మేలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి కెమెరా: రాజేంద్ర, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, రచన, దర్శకత్వం: సపన్ పసుపర్తి.