Varudu | Cinema | Allu Arjun | Gunasekhar | DVV Danayya | Amritsar | "వధువు" ఎవరో తెలుసా..? అమృతసర్ అమ్మాయి..!: డివివి
WD
వధువు గురించి రకరకాల కథనాలు వస్తున్నాయని, సినిమాలో ఇంటర్‌వెల్‌కు ముందే వధువును చూపిస్తామని అన్నారు. వధువు పాత్ర పోషించిన అమ్మాయి అమృతసర్‌కు చెందిందని మాత్రం చెప్పారు. ఆమె నటీమణా? కాదా? అనే రిలీజ్‌నాడే తెలియజేస్తామని నిర్మాత అన్నారు.
అసలు హీరో కూడా పెండ్లి చూపుల్లోనే ఆ అమ్మాయిని చూస్తాడని, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం, పెండ్లి తంతు ఐదు రోజులు జరగడం నేపథ్యంలో "వరుడు" సినిమా రూపొందిందని నిర్మాత వెల్లడించారు.
300 ప్రింట్లతో సినిమాను విడుదల చేస్తున్నామని, పెండ్లితంతుపై చాలా చిత్రాలు వచ్చిన ఇంత వైవిధ్యంగా ఏ చిత్రమూ రాలేదని నిర్మాత చెప్పారు. అల్లు అర్జున్ కెరీర్‌లో వసూళ్ళపరంగా "వరుడు" రికార్డు బ్రేక్ చేస్తాడని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, నరేష్, సుహాసిని, షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, మాటలు: తోటప్రసాద్.