1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. శ్రీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిలిమ్ "రంగ ది దొంగ"

Actor Srikanth, Ranga the Donga, Vimala Raman | శ్రీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిలిమ్ "రంగ ది దొంగ"

శ్రీకాంత్
WD
శ్రీకాంత్ హీరోగా సుధాకర్ నాయుడు దర్శత్వంలో గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం 'రంగ ది దొంగ'. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... దొంగ అనేది బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ ఫార్ములా. అందరు అగ్రతారలు దొంగగా నటించి విజయాలను కైవసం చేసుకున్నారు.

ఆ పాత్రలతో పోలిస్తే శ్రీకాంత్ పోషించే దొంగ పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. కథానాయిక విమలారామన్ ఇందులో పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. ఆ పాత్ర తీరు తెన్నులు వినోదాత్మకంగా ఉంటుంది అన్నారు.

ఈ చిత్రంలో శ్రీకాంత్, విమలా రామన్లతో పాటు రామకృష్ణ, భువనేశ్వరి, తస్లీమా, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణా శకుంతల, శివాజీ రాజా, తిరుపతి ప్రకాశ్, గౌతం రాజు, చిత్రం శ్రీను, నాగరాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, నిర్మాత: సిఆర్ మనోహర్, సుధాకర్ నాయుడు, రచన దర్శకత్వం: సుధాకర్ నాయుడు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT