1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Actor Balakrishna

Simha | Actor Balakrishna | 1000 shows | సుప్రీమ్ ద్వారా బాలకృష్ణ "సింహా" ఓవర్సీస్

సింహా
WD
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా'ని ఓవర్సీస్‌లో సుప్రీమ్ రాజు విడుదల చేస్తున్నారు. 25 సెంటర్లలో 1000 షోలతో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సుప్రీమ్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ... గతంలో మగధీర ఓవర్సీస్ చేశాను. ఆ తర్వాత ఆర్య-2 చేశాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ చిత్రాన్ని అమెరికాలో విడుదల చేస్తున్నాం. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.

చిత్ర సమర్పకుడు పరచూరి ప్రసాద్ మాట్లాడుతూ.. యునైటెడ్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించాం. సినిమాకు క్రేజ్ ఏర్పడింది. 25 సెంటర్లలో 40 స్క్రీన్లలో 1000 షోలను అమెరికాలో వేయడం రికార్డ్‌గా భావిస్తున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ... ఇందులో ఆరు పాటలున్నాయి. 2 మెలోడీ చేశాను. బాలకృష్ణ కెరీర్లో మంచి మ్యూజిక్ హిట్ చిత్రమవుతుందన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ... ఈ రోజుతో షూటింగ్ పూర్తవుతుంది. బాలయ్య కెరీర్లో ఇదో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. కథ ప్రకారం సింహా అనే టైటిల్ పెట్టాలి. కనుకనే ఆ టైటిల్ పెట్టాం. ఏప్రిల్ రెండో వారంలో సినిమా విడుదల చేస్తున్నాం అని అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT