Actor Akkineni Nageswara Rao | Mother Industry | Mayabazar | Tollywood | ఈ రోజుల్లో అంతా విప్పేసి చూపిస్తున్నారు: అక్కినేని
WD
మాయాబజార్ కలర్ సినిమా 50 రోజుల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. "మాయాబజార్‌లో హీరో ఎవరు..? అనే ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. ఎవరని చెప్పాలి. నా దృష్టిలో సావిత్ర అని చెప్పగలను. ఘటోత్కచునిగా ఆయన హావభావాలు పలికించడమే కాకుండా... స్త్రీగా ఆమె నటించిన హావభావాలు ఆ చిత్రానికి వన్నె తెచ్చాయి.
ఈ రోజుల్లో బట్టలు విప్పతీసి నటించేవారు చాలామంది ఉన్నారు. కానీ బట్టలు కట్టుకుని నటించి మెప్పించగల నటి సావిత్రే అని చెప్పగలను" అంటూ అక్కినేని వ్యాఖ్యానించారు.
"మాయాబజార్‌లో నటించినవారంతా ఉద్దండులే. అందరూ కాలధర్మం చెందారు. నేనొక్కడినే మిగిలాను. నాకే చాలా బాధగా ఉంది. అసలు మీకో రహస్యం తెలుసో తెలియదో గానీ నేను దాన్ని చెపుతాను. మాయాబజార్ సినిమానే అంతా మాయ. అసలు బలరామునికి కూతురే లేదు. కానీ ఉన్నట్లు కథను అల్లి సినిమా తీశారు. నా దృష్టిలో అదంతా మోసబజార్" అంటూ అక్కినేని నాగేశ్వరరావు నెమరేసుకున్నారు. ఈ చిత్రంతోపాటు శ్రీకృష్ణపాండవీయం, పాండవ వనవాసం, మూగమనసులు వంటి చిత్రాలను కూడా ఆధునిక టెక్నాలజీలతో తీస్తే బాగుంటుందని తెలిపారు.