1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. మళ్లీ "రెడీ" జంటతో స్రవంతి మూవీస్

Actor Ram, Geneelia, Sravanti Movies | మళ్లీ "రెడీ" జంటతో స్రవంతి మూవీస్

రామ్
WD
రామ్, జెనీలియా అనగానే రెడీ చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ కాంబినేషన్లో మళ్లీ స్రవంతి మూవీస్ నూతన చిత్రాన్ని నిర్మిస్తోంది. సోమవారం రామానాయుడు స్టూడియోలో రామ్‌పై తీసిన ముహూర్తపు షాట్‌తో షూటింగ్ ఆరంభించారు. రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి మొదలై సినిమా పూర్తయ్యే వరకూ కొనసాగుతుందని నిర్మాత స్రవంతి రవికిషోర్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చక్కని జంటగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన జంట ఇది. మా బ్యానర్లో మూడవ సినిమా ఇది. ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాం. తొలిసారిగా చక్రి సంగీతం అందిస్తున్నారని చెప్పారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... కిక్ తర్వాత తొమ్మిది నెలల గ్యాప్ తీసుకుని మంచి కథను సిద్ధం చేసుకున్నాను. వక్కంతం వంశీ చక్కటి కథ ఇచ్చారు. కోన వెంకట్ అదిరిపోయే డైలాగ్స్ రాశారు. రామ్‌లో ఎనర్జీ నన్ను బాగా ఆకట్టుకుంది. ఎప్పుడో సినిమా చేయాల్సింది. ఇప్పటికి కుదిరింది అని చెప్పారు.

చక్రి మాట్లాడుతూ... మ్యూజికల్‌గా మంచి సినిమా అవుతుంది. ఇప్పటికే బాణీలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో రికార్డింగ్ ప్రారంభిస్తాం అన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ... నా సోదరుడు కృష్ణ చైతన్య చిత్రానికి సమర్పకునిగా ఉన్నారు. సురేందర్ రెడ్డి హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అన్నారు.

ఈ చిత్రానికి కెమేరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT