Mangala movie | Actress Charmi | Tulasi Ram | "మంగళ"గా భయపెట్టేందుకు వస్తున్న ఛార్మి
WD
ఈ చిత్రం గురించి ఛార్మి మాట్లాడుతూ... "ఈ చిత్రానికి పనిచేసిన చాలామంది ఇందులో పనిచేస్తున్నారు. ఇదొక థ్రిల్లర్ మూవీ. అందులో ఎంత భయపెట్టించానో కానీ ఈ చిత్రంలో మాత్రం అందరినీ భయపెడతాను. కథ విన్నప్పుడే నాకు భయమేసింది. దానికంటే డబుల్ హిట్ అవుతుందని నమ్మకముంది" అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ... మంత్ర నుంచి తులసీరామ్ నాకు తెలుసు. థ్రిల్లర్ చిత్రాల్లో మంత్ర ట్రెండ్ సెట్టర్ అయింది. పెద్ద హిట్ అవుతుందనే నమ్మకముంది అన్నారు.
తులసీరామ్ మాట్లాడుతూ... గ్రాఫిక్స్‌తో అందర్నీ భయపెట్టే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుందని చెప్పారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామనీ, కంటిన్యూగా సాగే షెడ్యూల్తో పూర్తి చేస్తామని తెలిపారు. కథ: ఓషో తులసిరామ్, మాటలు: జంధ్యం వెంకటేష్ బాబు, డాన్స్: శేఖర్, కెమేరా: శివేంద్ర, సంగీతం: విశ్వ