1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sandhya

Hasini Movie | Sandhya | Kamalakar | "హాసిని" షూటింగ్ పూర్తి... మార్చి 31న ఆడియో

హాసిని చిత్రం
అభి ఫేమ్ కమలాకర్. ప్రేమిస్తే ఫేమ్ సంధ్య కలయికలో రూపొందుతున్న చిత్రం హాసిని. బీవీ రమణారెడ్డి దర్శకత్వంలో కమల్ పిక్చర్స్ పతాకంపై కమలాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్ర సమర్పకురాలు బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ... ఇటీవలే థాయ్‌లాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించాం. కమలాకర్, సంధ్య, ఆఫియాపై కృష్ణారెడ్డి నృత్యదర్శకత్వంలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పట్టాయా, పుకెట్‌ల్లో ఈ పాటలను తీశాం. ఇప్పటికే ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తయింది. రీరికార్డింగ్, ఇతర కార్యక్రమాలను పూర్తి చేసి, ఏప్రిల్ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ... ఇది ఫక్తు వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. లవ్, రొమాన్స్, ఎంటర్‌టైన్మెంట్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో రంగరించి తీస్తున్నాం. కోటి సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరో కమలాకర్ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. ఈ నెల 31న హైదరాబాదులో ఆడియో వేడుకను ఘనంగా చేయబోతున్నాం అని చెప్పారు.

గిరిబాబు, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ, కృష్ణ భగవాన్, వేణు మాధవ్, సురేఖా వాణి, హేమ... తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కెమేరా: కె.ప్రసాద్, ప్రాజెక్ట్ డిజైనర్: సీహెచ్ వెంకట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. ప్రవీణ్ చంద్ర
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT