1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Buridi

EVV Satyanarayana | Buridi | Brahmanandam | ఏప్రిల్ 30న విడుదల కానున్న ఇ.వి.వి "బురిడి"

ఇవివి సత్యనారాయణ
WD
ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 23మంది కమెడియన్స్‌తో చేస్తున్న సినిమా బురిడి షూటింగ్ పూర్తయింది. ఇటీవలే బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా సోమవారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఇ.వి.వి మాట్లాడుతూ... షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ ప్రారంభమయింది. ఏప్రిల్ 10 నుంచి రీరికార్డింగ్ కూడా జరుగుతుంది. మొదటివారంలోనే ఆడియోను విడుదల చేస్తాం. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.

అప్పుల అప్పారావు నుంచి బెండు అప్పారావు వరకూ తనను ప్రేక్షకులు ఆదరించారనీ, కామెడీ చిత్రాలు తీయాలనే ధైర్యాన్ని ప్రేక్షకులే కల్పించారని అన్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం 18 వర్షన్‌లు రాశాననీ, అంతా పక్కా అయ్యాకే సెట్‌పైకి వెళ్లానని చెప్పారు.

ఇందులో ఓ పాటను 12 సెట్లు వేసి తీశామని అత్యంత ఖరీదైన సాంగ్ ఇదనీ, 10 నిమిషాలపాటు సాగే పేరడీ పాట చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. ఇంకా బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరామ్, కొండవలస, అలీ తదితరులు బ్యాంకాక్ షూటింగ్ విషయాలను ముచ్చటించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT