Avaaham | Ghoast | Ram gopal Varma | "ఆవాహం"లో దెయ్యాన్ని చూసి జడుసుకున్నా: వర్మ
IFM
ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ... పూంఖ్ -2 చిత్రానికీ దీనికీ సంబంధమే లేదు. ఆ సినిమా చూడకపోయినా ప్రేక్షకులకు ఈ సినిమా అర్థమవుతుంది. భయమనేది యూనివర్సల్ పాయింట్. అందుకే ఇక్కడ కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం.
చచ్చిపోయిన వాళ్లు దెయ్యాలు అవుతారా..? లేకపోతే కక్ష ఉన్నవాళ్లు మాత్రమే దెయ్యాలుగా మారతారా...? అనేది ఈ చిత్రంలో పాయింట్. ఒక స్త్రీ దెయ్యమై ఓ కుటుంబంపై కక్ష కడుతుంది. ఆ కుటుంబాన్ని చిత్ర హింసలు పెడుతుంది. ఆవాహం లైన్ ఇదే. థియేటర్ల నుంచి ఇంటికి వెళ్లాక కూడా భయం మనల్ని వెంటాడుతుంది.
ఏప్రిల్ 16న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. దర్శకుడు మిలింద్ బాగా తీశాడు. నేనే కొన్ని సన్నివేశాలను చూసి భయపడ్డాను అన్నారు. మరీ అంతగా భయపెడితే జనాలు రాకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న వేస్తే... నా సినిమా నచ్చినవాళ్లే చూస్తారని ముక్తసరిగా సమాధానమిచ్చారు.