1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rakhi Sawant

Item girls | Rakhi Sawant | Foreign actresses | Bollywood | ఫారిన్ తెల్ల పాపలు "లాలిపప్"లు: రాఖీ సావంత్

ఐటమ్ గాళ్స్
విదేశాల నుంచి బాలీవుడ్‌లో ఐటమ్ గాళ్స్‌గా దిగుమతి అవుతున్న తెల్ల అమ్మాయిలందరూ లాలీ‌పప్‌ల్లాంటివారని బాలీవుడ్ హాట్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ ఎద్దేవా చేస్తోంది. తెల్లతోలుతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ఈ అమ్మాయిలు తమ ఛాన్సులు ఎగరేసుకుపోతున్నారనీ అక్కసు వ్యక్తం చేసింది. ఈ అమ్మాయిలను బాలీవుడ్‌లో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

అదలా ఉంచితే... రాఖీ ఇటీవల విడుదల చేసిన కొన్ని ఆల్బమ్స్ విదేశీ తెల్ల అమ్మాయిలు కంపోజ్ చేసినవి కావడం గమనార్హం. అంతేకాదు ఆమె మెయిన్ ఐటమ్ గాళ్‌గా రూపొందించిన పలు వీడియో ఆల్బమ్స్‌లో ఆమె సరసన గ్రూపుగా నర్తించినవారిలో తెల్ల ఐటమ్ గాళ్స్‌ కోకొల్లలుగా ఉన్నారు. ఇదే విషయాన్ని రాఖీని అడిగితే... ఎవరా చూసింది...? నా ప్రక్కనున్న తెల్ల అమ్మాయిలు బాలీవుడ్‌కు చెందినవారేనని బుకాయిస్తోంది.

బ్రిటిష్ ఎక్స్‌ట్రా నటీమణుల సంఖ్య హిందీ పరిశ్రమలో రానురాను ఎక్కువవుతోందనీ, ఫలితంగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో వాటినే నమ్ముకున్న ఐటమ్ గాళ్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతోందని రాఖీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, కొన్ని బాలీవుడ్ సినిమాల్లో విదేశీ నటీమణులు ఏకంగా హీరోయిన్ల ఛాన్సులను కొట్టేస్తున్నారని చెప్పుకొచ్చింది.

అక్షయ్ కుమార్ "బ్లూ" చిత్రంతోపాటు "రంగ్ దే బసంతి" చిత్రాల్లో విదేశీ వనితలు హీరోయిన్ల ఛాన్సులు కొట్టేసి బాలీవుడ్ తారల నోట్లో మట్టి కొడుతున్నారనీ, కనుక వెంటనే విదేశీ నటీమణులకు బాలీవుడ్లో ప్రవేశం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరి రాఖీ గోడును బాలీవుడ్ పట్టించుకుంటుందో లేదో...?!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT