Varudu | Lord Sri Rama | Sri Ramanavami | శ్రీరామునికి పట్టు వస్త్రాలు సమర్పించిన "వరుడు"
WD
హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఈ రోజు చాలా మంచి రోజు. సీతారాముల కల్యాణం జరిగే శ్రీరామ నవమి రోజున స్వామి సన్నిధానంలో వరుడు మార్చి 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. సీతారామ కల్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో అందరికీ తెలుసు. మా వరుడు చిత్రం కథలో కూడా పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ఐదు రోజుల పెళ్లిని అద్భుతంగా గుణశేఖర్ గారు తెరకెక్కించారు. ప్రేక్షకులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్చి 31న విడుదలయ్యే "వరుడు" అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. గుణశేఖర్ గారితో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనిపిస్తోంది. దానయ్యగారు కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్‌గా తీశారు. ఈ సమ్మర్ స్పెషల్‌గా వరుడు మీ ముందుకు వస్తున్నాడు అన్నారు.
దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. మా చిత్రంలో వేటూరిగారు పెళ్లిపాట రాస్తే అందులో "వరుడు" కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి అన్నారు. అంటే ఇందులో బన్నీ చేస్తున్న క్యారెక్టర్ పేరు సందీప్. అతనే వరుడు. ఈ వరుడు తన పెళ్లిని రాముడి పెళ్లంత ఘనంగా చేసుకోవాలని కోరుకుంటాడు. రాములవారి పెళ్లి ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరుగుతుంది.
మా వరుడు పెళ్లిని కూడా అంత వైభవంగా చూపించాం. ఐదు రోజుల పెళ్లి ప్రాసెస్‌ని డీటైల్డ్‌గా చూపించాం. ఈ కథలో పెళ్లికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగాని బన్నీ రాముడు మంచి బాలుడు అన్నట్లు ఉండడు. బన్నీ స్టైల్‌లోనే ఉంటాడు. శ్రీరామ నవమి రోజున రామాలయంలో మా చిత్రం వరుడు విడుదల తేదీని ప్రకటించడం ఆనందంగా ఉంది. అందరూ వధువు ఎవరు..? అని ఆసక్తిగా అడుగుతున్నారు. మార్చి 31న సస్పెన్స్ వీడిపోతుంది అన్నారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ... శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ 300కు పైగా ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా మార్చి 31న వరుడుని రిలీజ్ చేస్తున్నాం. వరుడు మా బ్యానర్లో చాలా పెద్ద హిట్ చిత్రం అవుతుంది. బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. గుణశేఖర్ గారు ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని రూపొందించారు అన్నారు.