1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Istapadite

April | Istapadite | Audio | Subhash Royal | Farakhan | Cinema | Tollywood | ఏప్రిల్ రెండో వారంలో "ఇష్టపడితే" ఆడియో విడుదల

ఏప్రిల్
వరలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై పడాల వెంకటరెడ్డి సమర్పణలో సుభాష్ రాయల్, ఫరాఖాన్ హీరోహీరోయిన్లుగా నిర్మితమైన చిత్రం "ఇష్టపడితే". ఈ చిత్రం ద్వారా ఎం.శ్రీనివాస్ దర్శకుడిగా తెలుగుతెరకు పరియచమవుతున్నారు. శ్రీరామచంద్రారెడ్డి, పొలిశెట్టి చంద్రశేఖర్, ఆర్.సూర్యప్రకాష్, జి.లక్ష్మీనారాయణ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ఇష్టపడితే".. 'ప్రేమేనా' అనే ట్యాగ్‌లైన్‌తో నిర్మిస్తున్నారు. 

ఈ చిత్ర వివరాలను నిర్మాతల్లో ఒకరైన పడాల శ్రీరామ్ చంద్రారెడ్డి వెల్లడించారు. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయినట్టు చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోందన్నారు.

ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. అలాగే చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తామన్నారు. సమర్పకుడు పడాల వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ, ఆకర్షణ, ఇష్టం అనే మాటలను యువత ఎలా అర్థం చేసుకుంటుందో ఈ చిత్రం ద్వారా చెప్పానున్నట్టు, అదే సమయంలో కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా తీస్తున్నట్టు చెప్పారు.

ఈ చిత్రంలో అమృతవల్లి, జీవా, కృష్ణభగవాన్, రఘునాథ రెడ్డి, వేణు మాధవ్, వినోద్, సత్యశ్రీ, ఉమారెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు.. సురేష్, ఎడిటింగ్.. శ్రీనివాసరెడ్డి, సంగీతం.. రాజ్‌కిరణ్, సమర్పుకులు.. పడాల వెంకటరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎం.శ్రీనివాస్.
About Writer
PNR