1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Madanudu

Songs | Madanudu | Producer | Tollywood | Dubbing | Cinema | పాటల రికార్డింగ్‌ను పూర్తి చేసుకున్న "మదనుడు"

పాటలు
"మన్మథులు" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత సురేష్ చౌదరి సూర్య పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం 'మదనుడు'. వైవిథ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం డబ్బింగ్, పాటలు, రీ రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొలికాపీకి సిద్ధమవుతోంది. 

ఈ సందర్భంగా మాటల రచయిత రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ.. భాషకు వ్యాకరణం ఎంత ముఖ్యమో జీవితానికి పరిధి అనేది అంత అవసరం. ప్రేమకైనా.. స్నేహానికైనా హద్దులు ఉండాలి. అలాకాని జీవితాలు ముగింపు ఎలా ఉంటుందో తెలిపే చిత్రమే 'మదనుడు'. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాలు ఇంతవరకు వెండితెరపై రాలేదు. చిత్రంలో పాత్రలే కనిపిస్తాయని తప్ప పాత్రధారులు కనిపించరు. అంత సహజంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.

అనంతరం నిర్మాత సురేష్ చౌదరి మాట్లాడుతూ.. ప్రేమ, స్నేహం, శీలం ఈ మూడు అంశాల చుట్టు తిరిగే విభిన్న కథాంశంగా ఈ "మదనుడు" రూపొందుతోంది. 'మదనుడు' మృగంగా మారితే జరిగే పరిణాలు ఏమిటనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. చిత్రంలోని పాటలను వెన్నెలకంటి, పొందూరి, వెలిదండ్ల రాశారు.

ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. తొలికాపీ సిద్ధం చేస్తున్నాం. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. ఆర్ముగమ్, స్వాతి రెహెనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్.. మధు, మాటలు.. రాజశేఖర్ రెడ్డి, దర్శకత్వం.. జో, నిర్మాత సురేష్ చౌదరి.
About Writer
PNR