1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Varun Sandesh

Kadir | Varun Sandesh | Prema Sandesam | New Film | Producer | కదిర్ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా కొత్త చిత్రం!

కదిర్
File
FILE
లోగడ "ప్రేమసందేశం", "హృదయం" వంటి ప్రేక్షకాధారణ పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించిన కదిర్ దర్శకత్వంలో యువ హీరో వరుణ్ సందేశ్ కథానాయకుడిగా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా "సేవకుడు" చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత యం.సుధాకర్ శ్రీమహాగణపతి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ చిత్ర వివరాలను నిర్మాత తాజాగా వెల్లడించారు. లోగడ ప్రేక్షకులు మెచ్చినటువంటి 'హృదయం', 'ప్రేమసందేశం', 'ప్రేమికుల రోజు' వంటి సంచలనాత్మక కథా చిత్రాలు కదిర్ దర్శకత్వంలో వచ్చినవన్నారు. ఈయన దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు చెప్పారు.

ఇది కదిర్‌కు ఐదో చిత్రమన్నారు. ఇందులో వరుణ్ సందేశ్ ఓ అద్భుతమైన పాత్ర పోషించబోతున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను సమకూర్చుతారన్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

అదే నెల 24వ తేదీ నుంచి ప్రతి నెలలో 20 రోజుల పాటు చిత్ర షూటింగ్ జరుపుతామన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి షూటింగ్‌ను పూర్తి చేసిన 2011 సంక్రాంతికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తామన్నారు. కాగా, ఈ చిత్రానికి వి.టి.విజయన్ ఎడిటింగ్ నిర్వహిస్తారన్నారు. చిత్రంలో నటించే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాత వెల్లడించారు.
About Writer
PNR