Leader | Success Meet | Chiranjeevi | Rana | Venkatesh | Chiranjeevi | చిరంజీవి కాంప్లిమెంట్ కంటే ఇంకేం కావాలి: శేఖర్ కమ్ముల
WD
లీడర్ సక్సెస్‌మీట్‌లో తొలుత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. "నిజంగా 'లీడర్' ఒక ప్రయోగం. కొత్త కథానాయకుడితో ప్రస్తుతం సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా క్లాస్‌గా ప్రజెంట్ చేయడం సాహసం. ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అందరూ హీరో బాగున్నాడని చెబుతుండే ఆనందమేసింది" అని అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "ఈ సినిమా చూడకపోయినా స్క్రిప్ట్ చదివాను. అప్పుడే పెద్ద లెజెండ్రీ సినిమా అవుతుంది అనిపించింది. డి. సురేష్‌బాబు తన కుమారుడిని 'ఖైదీ' లాంటి సినిమా ద్వారా పరిచయం చేయకుండా ఒక రాజకీయ నేపథ్యంగల సినిమా ద్వారా చేశాం. రక్తపు బొట్టులేకుండా ఈ సినిమా తీశారని తెలిసింది. ఇందులో చాలా సాహసాలున్నాయి. తన బాబాయ్ వెంకటేష్‌లాగా ఒక ఇమేజ్‌లేకుండా రానా రకరకాల సినిమాలు చేసినట్లు చేశాడు. ఈ సినిమాను చూశాను. తిరిగి వందరోజుల వేడుకలో మాట్లాడతాను" అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల గట్స్ ఉన్న దర్శకుడు. రానాను చూస్తే అతను ఏదైనా చేయగలడనిపించింది. ఈ సినిమాను చూసిన రామానాయుడు కళ్లలో ఆనందాన్ని చూశాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, "నేను ఈ ఫంక్షన్‌కు శేఖర్‌కమ్ముల కోసం వచ్చాను. దర్శకుడు కమిట్‌మెంట్, సిన్సియారిటీ, డెడికేషన్ ఉన్నవాడు. నాకు ఏవీఎంతో అనుబంధముంది. ఇది వారి 174వ సినిమా. రాజ్‌కపూర్ ఫ్యామిలీ రామానాయుడు కుటుంబం నుంచి మూడో జనరేషన్ వచ్చింది. రానా ప్రస్తుతం హిందీ సినిమా చేస్తున్నాడు. లీడర్ సినిమాను నేను చాలాసార్లు చూశాను. సంతృప్తినిచ్చింది" అని అన్నారు.
వి.వి. వినాయక్ మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల నాకు ఇష్టమైన దర్శకుడు. దర్శకుల్లో బాపుగారిలా ఇతను అలాంటి వాడు. రక్తపాతంలేకుండా రాజకీయ సినిమా తీయడం సాహసం. అతను 'ఆనంద్' ప్రివ్యూకు ఆహ్వానించాడు. అప్పుడే శంకర్‌దాదా సినిమాకు వెళ్ళాను. ఆ తర్వాత ఆ సినిమాకు ఎలాంటిదో తెలిసింది.
అప్పటినుంచి అతని సినిమాలు మార్నింగ్‌షో చూస్తాను. ఇక హీరో రానాను రామానాయుడు అని పిలవాలని ఇష్టం. దాంతో సురేష్‌బాబుగారు రామానాయుడు అని వేసి అందులోంచి రానా వచ్చేట్లు పేరు వేశారు. ఇక ఈ సినిమాను చేయలేదని వెంకటేష్‌తో సహా అందరూ హీరోలు కుళ్లుకుని ఉంటారు" అని వెల్లడించారు.
వెంకటేష్ మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల సరైన స్క్రిప్ట్ తయారు చేశాడు. నిర్మాణదశలో అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని. రషెస్ చూపించాడు. అప్పుడే ఈ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాను. రానా తన నటనలో సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మా
కుటుంబం నుంచి రానాను మా నాగచైతన్యను రిసీవ్ చేసుకున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు కష్టపడి మరింత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, "అమితాబ్ తొలిదశలో ఎలాంటి సినిమాలు చేశాడో రానాకూడా అలాంటి సినిమా చేసి నిరూపించుకున్నాడు. శేఖర్‌కమ్ముల హృదయాల్ని హత్తుకునేట్లుగా తీయగలడు అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, "ఈ సినిమా విజయానికి ఏవీఎం వారే కారణం. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు మన దేశం అంటే ఇష్టం. ఆ ఆలోచనలోంచే పుట్టింది ఈ సినిమా. ఎందుకు మనదేశం అభివృద్ది చెందలేదు అని చర్చించాను. ఈ సినిమా చూశాక మారకపోయినా మారాలనే భావన వస్తేచాలనే ఈ సినిమా తీశాను.
ఇంకా.. ప్రముఖులంతా సినిమా చూశారు. సి.ఎం.గారు త్వరలో చూడబోతున్నారు. రామోజీరావుగారు ఈ సినిమా తీయాలంటే ధైర్యంకావాలి అని చెప్పారు. చిరంజీవిగారైతే నీకు రాజకీయాలపై ఇంత అవగాహన ఉందా? అని అన్నారు. ఇంతకంటే ఇంకేం కాంప్లిమెంట్ కావాలి. అపరిచితుడు, మల్లన్న చిత్రాల్లా ఇది కూడా ఒక రియాలిటీ సినిమా" అని చెప్పారు.