1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Tollywood

Cine Producers | Tollywood | AP Government | మమ్మల్ని కూడా గట్టెక్కించండి: చిన్న నిర్మాతలు

చిన్న నిర్మాతలు
పైరసీపై ప్రభుత్వం స్పందించిన తీరు సంతృప్తికరంగా ఉండటంతో ఇప్పుడు తాజాగా చిన్న నిర్మాతలు తమను కూడా గట్టెక్కించాలని అభ్యర్థిస్తున్నారు. ఇందుకుగాను చిన్ననిర్మాతలు, దర్శకులందరూ గురువారంనాడు హైదరాబాదులోని సారథి స్టూడియోలో సమావేశమై ప్రభుత్వానికి నాలుగు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు.

మొదటిదేమంటే... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నట్లు ప్రతి థియేటర్లో ఏడాదికి 24 వారాలు చిన్న సినిమాలకు అద్దె కాకుండా పర్సంటేజ్ ఆధారంగా వసూలు చేయాలి.

చిన్న సినిమాలకు మొదటి నాలుగు వారాలు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నది రెండో కోరిక. ఇక మూడోది... తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన నేపధ్యంలో తెలుగు పేర్లతో వచ్చే సినిమాలకు ప్రత్యేక రాయితీ ఇవ్వాలన్నది.

అదేవిధంగా ప్రభుత్వ లొకేషన్లలో చిన్న సినిమా షూటింగ్‌లు జరిపేటపుడు నామమాత్రపు చార్జీలను వసూలు చేయాలి. దీంతోపాటు బాలల చిత్రాలకు స్క్రిప్ట్ స్క్రూట్నీ స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నాలుగు కోట్ల రూపాయలకు మించని ప్రతి సినిమాను చిన్న సినిమాగా పరిగణించాలని చిన్న చిత్రాల నిర్మాతల సంఘం తెలిపింది.

ఈ సమావేశంలో శివనాగేశ్వరరావు, భీమినేని శ్రీనివాస్, పీసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT