Akkineni Nagarjuna | Actress Bhumika | Parachute | Oil | అది పడితే బాడీ అంతా కూల్ అయిపోతుంది: నాగార్జున
WD
మారికో బ్రాండ్ అయిన పారాచూట్ అడ్వాన్స్‌డ్ కూలింగ్ ఆయిల్ ఉత్పత్తిని ఆయన గురువారం మార్కెట్లో ప్రారంభించారు. ఆయనతోపాటు నటి భూమికా చావ్లా కూడా పాల్గొంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, "పారాచూట్ మూత తీయగానే చమక్కుమనే సువాసన వస్తుంది. దాన్ని తల మీద పోసుకోగానే చాలా కూల్‌గా ఉంటుంది.
బాడీ అంతా ఎనర్జీ వచ్చినట్లవుతుంది. కాసేపు మైల్డ్‌గా కూడా ఉంటుంది" అని పారాచూట్ రాసుకున్న తర్వాత జరిగిన సంగతులు తెలిపారు. ఈ ఉత్పత్తి యాడ్‌లో ఆయన పాల్గొన్నారు. అందులో ఆయన తలపై ఎవరో నూనె పోసి రుద్దుతారు. ఆమె ఎవరు..? అని విలేకరులు అడిగితే... అదంతా సీక్రెట్. ఆయిల్‌తో పాటు ఆమె రాయడంతో బాడీ అంతా ఇంకా కూల్‌గా అయిపోయిందని చమత్కరించారు.