Amayakudu | Krishnudu | Ananya | Poonam Singar | Geeta Singh | Audio | కృష్ణుడి "అమాయకుడు" ఆడియో విడుదల
WD
కృష్ణుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. "మణికంఠ కద్రి అన్ని రకాల వారిని ఆకట్టుకునే బాణీలు సమకూర్చారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తనకు నచ్చిన అమ్మాయి, పెద్దలు కుదిర్చిన అమ్మాయి, తనను మెచ్చిన అమ్మాయి.. ఇలా ముగ్గురు మధ్య నలిగే అమాయకుడి కథే ఈ చిత్రం. ముఖ్యంగా దుబాయ్ నుంచి వచ్చి తెలుగుపై ఉన్న అభిమానంతో సినిమా తీసిన నిర్మాతలైన బాలమురుగన్, అనిల్ ఎస్ నాయర్, సుదర్శన్ కుమార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు.." తెలియజేసుకుంటున్నానన్నారు.
సంభాషణల రచయిత ఘటికాచలం వ్యాఖ్యానిస్తూ.. "మాట-పాట సినిమాకు ప్రాణం. అవి పొందిక ఉన్న సినిమా ఇది. కొన్నిచోట్ల సెంటిమెంట్ సన్నివేశాలు హత్తుకుంటాయి. అసలీ కథను కొన్ని సంవత్సరాల క్రితమే దర్శకుడు రాసుకున్నారు. దాన్ని చక్కటి ఆకృతిలో మదించి ఒక రూపానికి తెచ్చారు. ప్రధానంగా సోదరి సెంటిమెంట్‌తో ఈ చిత్రం రూపొందింది" అని అన్నారు.
గీత రచయిత వనమాలి మాట్లాడుతూ.. "కద్రి సంగీత సారథ్యంలో తాను పాటలు రాసిన మూడో చిత్రమిది. సాహిత్య భావాలు తెలిసిన సంగీతదర్శకుడు లభించడం అదృష్టం. పాటలతో పాటు చిత్రం కూడా ప్రేక్షకాదరణపొందుంతుందనే నమ్మకముంది" అని తెలిపారు. సరస్వతీ ఆడియో ద్వారా విడుదలైన ఈ ఆడియో ఈ నెల 26న మార్కెట్లోకి రానుంది.