Actor Raviteja | Richa Gangopadhyaya | Mirapakay | రవితేజ- రిచా గంగోపాధ్యయల "మిరపకాయ్"
WD
చిత్రం గురించి నిర్మాత రమేష్ తెలుపుతూ... హరీష్ చెప్పిన కథ విన్నాకే సినిమీ తీయాలనిపించింది. రవితేజకు సరిపడే కథ ఇది. కథ రీత్యా ఐర్లాండ్, పారిస్, దుబాయ్‌లలో షూటింగ్ చేస్తున్నాం. మే 22న షూటింగ్ ప్రారంభిస్తాం. దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. రవితేజ మాట్లాడుతూ... షాక్ చిత్రం తర్వాత హరీష్ చేస్తున్న చిత్రమిది. నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే కథ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... షాక్ చిత్రం కొంత అనుభవాన్ని నేర్పింది. ఇండస్ట్రీలో సక్సెస్‌కే వేల్యూ ఇస్తారు. సక్సెస్ లేకపోయినా స్క్రిప్ట్‌పై నమ్మకంతో రవితేజ, నిర్మాత నాకు అవకాశం కల్పించారు. ఇది పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమని అన్నారు. సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ... కిక్, ఆంజనేయులు తర్వాత రవితేజతో చేస్తున్న చిత్రమిది. మంచి మెలడీగల పాటలుంటాయి అన్నారు.
తనకిది రెండవ సినిమా అనీ, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే బ్రాహ్మణ యువతిగా నటిస్తున్నాననీ, పాత్రను సవాల్‌గా స్వీకరిస్తున్నానని రిచా గంగోపాధ్యాయ పేర్కొన్నారు. తాను ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నానని రాజారవీంద్ర అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో సునీల్, చంద్ర మోన్, కోట, ధర్మవరపు, అలీ, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు ఎంపికయ్యారు. సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్, స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, విక్రమ్ సిరి, దీపక్ రాజు, కథ- మాటలు- దర్శకత్వం: హరీశ్ శంకర్ ఎస్