1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ప్రకాష్ రాజ్ ఇంత తెలివి తక్కువ వాడా...?!!: బెల్లంకొండ

Actor Prakash Raj, Bellamkonda Suresh, 1940lo Oka gramam | ప్రకాష్ రాజ్ ఇంత తెలివి తక్కువ వాడా...?!!: బెల్లంకొండ

ప్రకాష్ రాజ్
WD
ప్రకాష్ రాజ్‌పై నిర్మాత బెల్లంకొండ విరుచుకపడ్డారు. ఇటీవల ప్రకాష్ రాజ్ తనకు జాతీయ స్థాయి అవార్డును ఢిల్లీలో అందుకున్న సందర్భంలో ఓ జ్యూరీ సభ్యుడు "జాతీయ స్థాయిలో తెలుగు సినిమా" ఒక్కటి కూడా రాకపోవడం శోచనీయమని తనతో చెప్పారని ప్రకాష్ రాజ్ మీడియాతో అన్నారు.

ఇదే విషయాన్ని మళ్లీ ప్రకాష్ రాజ్ గుర్తు చేస్తూ తెలుగులో మంచి చిత్రాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. తెలుగులో "1940లో ఒక గ్రామం" చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు. అదే స్టేజిపై ప్రకాష్ రాజ్ తర్వాతే ఆ చిత్ర దర్శకుడు నరసింహా "నంది" అవార్డును అందుకున్నారు.

ఈ విషయం కూడా ప్రకాష్ రాజ్‌కు తెలియదా. ప్రక్కనే అవార్డు తీసుకుంటున్న వ్యక్తి ఏ భాషకు చెందిన చిత్రానికి తీసుకుంటున్నాడో తెలియనంత అజ్ఞానంలో ఉన్నాడా..? ప్రకాష్ రాజ్ మరీ ఇంత తెలివి తక్కువ వాడా...?!! అంటూ దుయ్యబట్టారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT