Actor Ramcharan Teja | Birth day | March 27 | Magadheera | హేపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ
WD
కేవలం రెండంటే రెండు సినిమాల వయసుతోనే టాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. రామ్ చరణ్ తేజ తన రెండో చిత్రం మగధీర ద్వారా ఏకంగా 90 కోట్ల రూపాయల కలెక్షన్లను కురిపించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. బహుశా... ఈ రికార్డును అధిగమించాలంటే ఇపుడున్న కుర్ర హీరోలు చాలా కష్ట పడాల్సిందే.
ఆ చిత్రంలో గగుర్పొడిచే హార్స్ రైడింగ్‌లు, ఫైట్స్, డ్యాన్స్‌లలో తండ్రి మెగాస్టార్ చిరంజీవినే మించిపోయే రీతిలో చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. మొత్తమ్మీద కేవలం రెండు చిత్రాలతోనే 200 సినిమాలు చేసినంత క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఫ్యూచర్లో కూడా రామ్ చరణ్ తేజ ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించాలని కోరుకుంటూ మనం కూడా అతనికి జన్మదిన శుభాకాంక్షలు చెపుదామా...