Actress Neha Dhupia | WIFW | bridal lehenga | వధువు దుస్తుల్లో.. ఉహు..హు.. నాకు సిగ్గేస్తోంది బాబూ: నేహా
దుస్తులను అత్యంత తక్కువగా వాడుతూ పొదుపు పాటించే అర్థనగ్న సుందరి నేహాధూపియా శుక్రవారం న్యూ ఢిల్లీలో జరిగిన విల్స్ ఇండియా ఫ్యాషన్ షోలో పాల్గొంది. ధూపియా పాల్గొంటే ఏమిటటా..? అని మీరనుకోవచ్చు. కానీ షోలో నేహా ధూపియా అర్థనగ్నానికి బదులు మరో రకంగా కనబడింది.
శరీరాన్నంతా నిండుగా కప్పి ఉంచే పెళ్లి కూతురు దుస్తులను ధరించి ఫ్యాషన్ షోలో కనిపించింది. షోను తిలకించేందుకు వచ్చినవారు తొలుత ధూపియాను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత నేహాను గుర్తుపట్టిన కొందరు ఆమె వద్దకెళ్లి డ్రెస్ బావుందని కితాబిచ్చారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జయా రాథోర్ రూపొందించిన ఈ దుస్తులను వేసుకున్న నేహా తను నిజంగానే వధువుగా మారిపోయినట్టుగానే తెగ సిగ్గు పడిపోయింది. తనవద్దకు వచ్చినవారితో సిగ్గులు చిందిస్తూ... " ఇంతవరకూ ఇటువంటి దుస్తులను నేను ధరించనే లేదు. ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సులు ధరించడం వల్లనో ఏమో, వధువు దుస్తులు ధరించిన నాకు భలే సిగ్గేస్తుంది బాబూ.." అంటూ గారాలు పోయింది.
