Pavan Kalyan | Director Jayanth | Trivikram Srinivas | Komaram Puli | "కొమరం పులి" డేటింగ్ ప్రేమ... నచ్చితే ఉండు లేకపోతే ఫో..!!
WD
ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ హాజరు కావడం ఒక ఎత్తయితే దాసరి నారాయణరావు మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. మొత్తమ్మీద కార్యక్రమం "అదిరిందయ్యా పులీ" అన్న రేంజ్‌లో జరిగింది.
ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను కదిలించి మాట్లాడేందుకు మీడియా వారు ఎగబడ్డారు. కానీ "కొమరం పులి" సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదలా ఉంచితే ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనవారు మాత్రం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, జయంత్ గురించి సెటైరికల్‌గా మాట్లాడుకోవడం కన్పించింది. జయంత్ సినిమా 'లవ్ ఫర్ ఎవర్' ఇంకా పూర్తి కాలేదు.. అదే విధంగా పవన్ కల్యాణ్ నటిస్తున్న 'కొమరం పులి' సైతం ఇంకా సాగుతూనే ఉంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం కూడా ఇదే దశలో ఉంది.
ఇలా ముగ్గురు చేస్తున్న సినిమాలు ఇంకా నిర్మాణ దశలో ఉండగానే ముగ్గురూ కలిసి మరో కొత్త చిత్రాన్ని చేయడానికి పూనుకోవడంపై అందరూ మాట్లాడుకోవడం కన్పించింది. ఇంతకీ ఈ చిత్రం కథ ఏమిటో... అని ఆరా తీస్తే, హిందీ చిత్రం లవ్ ఆజ్‌కల్ చిత్రానికి రీమేక్ అని తెలిసింది. నేటి ప్రేమ పరిస్థితి ఎలా ఉందో ఈ చిత్రంలో చూపెడతారట.
ఇంతకీ నేటి ప్రేమ ఎలా ఉందని చిత్ర యూనిట్‌కు చెందిన ఒకాయనను కదిలిస్తే... ఇప్పుడన్నీ డేటింగ్ ప్రేమలే కదండీ... దీనిని ఇతివృత్తంగా తీసుకుని సినిమా తీస్తున్నట్లు సమాచారం. నేటి ప్రేమ జంటల్లో చాలామంది ఇష్టమైతే కలిసి ఉండటం లేదంటే నీ దారి నువ్వు చూసుకో అనే రీతిలో ఉంటున్నారనీ, ఈ నేపధ్యంలో సినిమా సాగుతుందని భోగట్టా. మరి ఈ చిత్రంలో కొమరం పులి ఎటువంటి క్యారెక్టర్లో కనిపిస్తాడో చూడాలి.