Actress Anushka | Panchakshari | V. Samudra | పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నా: అనుష్క
అనుష్క "అరుంధతి" తర్వాత నటిస్తోన్న పంచాక్షరి చిత్రం షూటింగ్ పూర్తయింది. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి. సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... పంచాక్షరి పేరులోనే పవిత్రత ఉంది. ఇది పవర్ ఫుల్ సినిమా.
ఇలాంటి సబ్జెక్ట్ ఇంతవరకూ రాలేదు. అరుంధతి తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ఆమె కెరీర్‌కు మరో మైలు రాయిలా నిలుస్తుంది అని చెప్పారు. నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ... షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమంలో భాగంగా డబ్బింగ్ జరుగుతుంది. ఏప్రిల్ మొదటివారంలో ఆడియోను, నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.
అనుష్క మాట్లాడుతూ, ఇందులో తాను రెండు పాత్రలను పోషిస్తున్నట్లు చెప్పారు. రెండు పాత్రలకు తెలీని సంబంధం ఒకటి ఉంటుంది. అది ఏమిటనేది చిత్రంలో చూడాల్సిందే. అరుంధతి తర్వాత అంతటి పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాను. అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే చిత్రమవుతుందనే నమ్మకముందని తెలిపారు.
