1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Pop star Smitha

Akkineni Nagarjuna | Pop star Smitha | MAD school | టాలెంట్ ఉన్నవారికి కాస్త తిక్క ఉంటుంది: నాగ్

అక్కినేని నాగార్జున
WD
టాలెంట్ ఉన్నవారికి కొద్దిగా తిక్క కూడా ఉంటుందనీ, లేకపోతే టాలెంట్ బయటకు రాదని అక్కినేని నాగార్జున అన్నారు. పాప్ ఆల్బమ్ స్మితను ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. స్మిత మ్యాడ్ (ఎం.ఎ.డి) అనే డాన్స్ స్కూల్‌ను స్థాపించింది. జూబ్లి హిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపాన గల పాఠశాలను అక్కినేని నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణి ప్రారంభించారు.

మ్యాడ్ అనేది ఏమిటి..? అనేది చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. ఎం అంటే మ్యూజిక్, ఎ అంటే ఆర్ట్స్, డి అంటే డాన్స్ అంటూ స్మిత వివరించారు. కూచిపూడి, కథక్, ఒడిస్సీ, కర్నాటక, హిందూస్థానీ మొదలైన నృత్యాలన్నీ ఒకే పాఠశాలలో నేర్పుతున్నామన్నారు. ఇందుకు అనుభవజ్ఞులైన గురువులు తర్ఫీదు ఇస్తారనీ, జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే చేసే వృత్తిని పిచ్చిపిచ్చిగా ప్రేమించేయాలని, అప్పుడే అనుకున్న గోల్ చేరుకుంటామని పేర్కొన్నారు.

నా చిరకాల స్వప్నం నెరవేరిందని స్మిత తెలిపింది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇక్కడ ఉంటుందని చెప్పారు. డాన్స్‌తోపాటు మంచి వ్యక్తిత్వంగల మనుషులుగా తీర్చిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు.

నాగార్జున మాట్లాడుతూ.. స్మిత ఏది చేసినా సాధించేవరకు వదలదనీ, మాస్టర్స్‌తో నేర్పించడం ఆమెకు మంచి పేరు తీసుకురావలని అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. తెలుగులో పాప్ ఆల్బమ్ మహిళ చేస్తే సక్సెస్ అవ్వరనే మాటను ఛేదించి తనేంటో నిరూపించుకున్నది స్మిత. ఆమె పట్టుదలే ఈ పాఠశాల. ఆల్బమ్‌లాగే ఇదీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ... అన్ని డ్యాన్స్‌లు ఒకేచోట ఉన్న ఈ పాఠశాలలో తాను విద్యార్థిగా నేర్చుకుంటానన్నారు,. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి, సంగీత గురువులు మట్లాడుతూ, స్మిత కలలు ఫలించాలని ఆశీర్వదించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT