1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actor Nitin

Maro movie | Actor Nitin | Actress Meera chopra | Hot | "మారో" అంటోన్న యువ హీరో నితిన్

మారో సినిమా
నితిన్ హీరోగా మీరాచోప్రా హీరోయిన్‌గా నటించిన "మారో" చిత్రానికి మలయాళ దర్శకుడు సిద్ధిక్ దర్శకత్వం వహించారు. నాలుగేళ్లుగా షూటింగ్ చేసి ల్యాబ్‌లో మగ్గిపోయిన ఈ చిత్రాన్ని మామిడాల శ్రీనివాస్ బయటకు తెచ్చారు. గతంలో ఈయన "అపరిచితుడు" నైజాం డిస్ట్రిబ్యూటర్.

మీరాచోప్రా, నితిన్ నటించిన ఈ చిత్రం అసలు పేరు "సత్యం శివం సుందరం". ఇప్పుడు పేరు మార్చి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి అష్టకష్టాలు పడి విడుదలకు సాహసం చేస్తున్న నిర్మాతకు గత నిర్మాత ఇవ్వాల్సిన పైకం పూర్తిగా ఇవ్వలేదని నిర్మాతను నితిన్ అడగటం, అందుకు కొంత సమయం ఇవ్వమనడంతో నితిన్ మీడియా ముందుకు రాలేదు.

ఇదిలావుండగా, ఈ చిత్రం గురించి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ... బుద్ధిబలంతో స్పందించే తీరు ఈ చిత్రంలో చాలా బాగుంటుంది. మైండ్ గేమ్ ఆడుతుంటాడు హీరో. మీరా చోప్రా అందాలు బాగున్నాయి. అన్ని రకాల అంశాలతో ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేస్తున్నాం అని చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT