1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Allu Arjun

Varudu film | Allu Arjun | Gunasekhar | "వరుడు" కోతిలా ఉండాలి... అవి బన్నీలో ఉన్నాయ్: గుణ

వరుడు చిత్రం
WD
"వరుడు" పెళ్లి ముహూర్తం ముంచుకొచ్చింది. వధూవరులకు రేపే పెళ్లి జరుగనుంది. సానియా - షోయబ్‌ల గురించి అనుకునేరు...? అదేం కాదు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సినిమా వరుడు చిత్రం విడుదల గురించిన సంగతి. అన్నమాట ప్రకారం మార్చి 31వ తేది వరుడు చిత్రాన్ని దర్శక నిర్మాతలు విడుదల చేస్తున్నారు. అదీ సంగతి.

ఇక వివరాలలోకి వెళితే... వరుడు చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్, హీరో అల్లు అర్జున్ మంగళవారం హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ... నేను అనుకున్న "వరుడు" సబ్జెక్టుకు కోతిలాంటి అబ్బాయి కావాలి. అటువంటి చేష్టలు నాకు బన్నీలో కనబడ్డాయి. అందుకే ఈ చిత్రంలో వరుడు పాత్రలో అర్జున్ నటిస్తున్నాడు.

ఇక చిత్రం విశేషాలను గురించి చెప్పాలంటే... నేటి ఆధునిక కాలంలో పెళ్లి నిమిషాల్లో జరిగిపోతోంది. ఇదివరకు వివాహాన్ని ఐదు రోజులపాటు చేసేవారు. ఎందుకలా చేసేవారు... దాని వెనుక ఉన్న విలువలు ఏమిటన్నవి చిత్రంలో చూపాము. మొత్తం 300 ప్రింట్లు, 150 డిజిటల్ ప్రింట్ల ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఇక బన్నీ మాట్లాడుతూ... నా పుట్టిన రోజు వచ్చే నెల 9వ తేదీ. ఈ చిత్రం నా పుట్టిన రోజు కానుక అవుతుందన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT